ETV Bharat / state

CPI Bus Yatra Reached to Tulluru: "ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్​ రెడ్డి ఓటమి ఖాయం" - సీపీఐ బస్సుయాత్ర

CPI Bus Yatra Reached to Tulluru: ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అమరావతి రాజధాని ఒక్కటే నష్టపోలేదని అన్ని జిల్లాల ప్రజలు నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రామకృష్ణ నేతృత్వంలో చేపట్టిన బస్సుయాత్రకు తుళ్లూరులో రాజధాని రైతులు స్వాగతం పలికారు. తుళ్లూరులో అమరావతి రైతులతో రామకృష్ణ ముఖాముఖి నిర్వహించారు.

CPI_Bus_Yatra_Reached_to_Tulluru
CPI_Bus_Yatra_Reached_to_Tulluru
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 10:24 PM IST

Updated : Aug 27, 2023, 6:38 AM IST

CPI Bus Yatra Reached to Tulluru: "ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్​ రెడ్డి ఓటమి పాలవటం ఖాయం"

CPI Bus Yatra Reached to Tulluru: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి.. ఓటమి పాలవటం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై సీపీఐ చేపట్టిన బస్సుయాత్ర.. ఈరోజు రాజధాని ప్రాంతంలోని తుళ్లూరుకు చేరుకుంది. ఈ సందర్బంగా రాజధాని రైతులు పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు.

తుళ్లూరులోని దీక్షా శిబిరం వద్ద నుంచి సాయిబాబ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో రాజధాని రైతులు మాట్లాడారు. ఈ క్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ.. దిల్లీలో రైతులు చేసిన ఉద్యమానికి నరేంద్ర మోదీ లాంటి వ్యక్తే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఏపీలో మాత్రం జగన్​మోహన్​ రెడ్డి నాలుగు సంవత్సరాలు మొండి వైఖరి అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు.

CPI Roundtable Meeting on Crimes Against the Dalits: వైసీపీ పాలనలో దళితుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది: సీపీఐ రామకృష్ణ

అమరావతిలో నిర్మాణాల కోసం 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పని ముఖ్యమంత్రి జగన్​.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనటం మూర్ఖత్వం కాక మరేమిటని ప్రశ్నించారు. సీఎం జగన్​ రుషికొండలో ఇల్లు నిర్మించుకున్న.. సముద్రంలోని ఓడలో ఉన్నా రాష్ట్ర ప్రజలకు ఉపయోగమేమి లేదని ఎద్దేవా చేశారు. రాజధానికి కులం ఆపాదించటం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు.

క్లాస్ వార్ అని మాట్లాడే ముఖ్యమంత్రి.. దేశంలో అందరికన్నా ధనిక ముఖ్యమంత్రనే విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జగన్ కూల్చింది ప్రజా వేదికను కాదని.. రాష్ట్రాన్ని కూల్చారని వ్యాఖ్యానించారు.

Ramakrishna Reaction on Cases Against Chandrababu: చంద్రబాబుపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి.. లేదంటే ఉద్యమిస్తాం: రామకృష్ణ

రాష్ట్రం అన్నిరంగాల్లో వెనుకబడి పోయిందని.. విభజన సమయంలో తెలంగాణ కన్న ఆదాయంలో ముందున్న రాష్ట్రం ఇప్పుడు వెనకబడిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డికి.. మోదీని, అమిత్​షాను చూస్తే భయంతో తనపై ఉన్న కేసులు గుర్తుకు వస్తాయన్నారు. అందుకోసమే పోలవరం, ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి వారిని అడగరని మండిపడ్డారు.

రాజధాని రైతులంటే ముఖ్యమంత్రికి భయం కాబట్టే.. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి తాడేపల్లి నుంచి వెంకటాపాలెంకు హెలికాప్టర్​లో వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ రాజధాని కర్నూలును పట్టించుకోలేదని, శాసన రాజధాని అని చెప్పిన అమరావతిని అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. చివరకు పరిపాలన రాజధాని విశాఖ అంటూ అక్కడి కొండలకు గుండ్లు కొడుతున్నారని ధ్వజమెత్తారు.ఇప్పటికైనా సీఎం జగన్ చేసిన తప్పులను సరిదిద్దుకుని.. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే చరిత్రలో మరో తుగ్లక్​లా ముఖ్యమంత్రి మిగిలిపోతారని విమర్శించారు.

CPI Ramakrishna comments on AP debts: రాష్ట్ర అప్పులపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది: రామకృష్ణ

ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అమరావతిని నాశనం చేయటం ద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కోర్టు తీర్పులను లెక్కచేయకుండా అమరావతిలో ఆర్ 5 జోన్ పేరిట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అమరావతే రాజధాని కావాలని ఉద్యమం చేస్తున్న రైతులపై కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.

"మోసగాడిగా చరిత్రలో రికార్డుకెక్కుతావు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కులానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు. పైగా నేను క్లాస్​ వార్​ నడుపుతానని అంటాడు. పెత్తందారులకు, పేదవారికి మధ్య పోరాటం చేస్తానని అంటాడు. నీకన్నా పెత్తందారులు రాష్ట్రంలో ఎవరూన్నారు. ఇక నీకు టైమ్​ అయిపోవాటానికి వచ్చింది." - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

CPI Rama Krishna on Current Charges: 'విద్యుత్ చార్జీలతో సామాన్యుడిపై భారం'

Last Updated : Aug 27, 2023, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.