నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మెడికొండూరు మండలంలోని మేడికొండూరు, పేరెచర్ల, కొర్రపాడు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు జరిపారు. కొర్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థికి, పేరేచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుకి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు.
నవంబర్ 2 నుంచి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ముందుగా బడి పిల్లలకు, ఉపాధ్యాయులకు కొవిడ్ -19 పరీక్షలు చేస్తున్నారు.
ఇవీ చూడండి.
ఉద్ధండరాయునిపాలెంలో పోటాపోటీ ఆందోళనలు..భారీగా పోలీసుల మోహరింపు