కొవిడ్ చికిత్స కోసం గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వృద్ధుడు.. ఆసుపత్రి బయట ఉండటం కలకలం రేపింది. నగరం మండల కేంద్రానికి చెందిన ఓ వృద్ధుడు ఈనెల 16న ఆసుపత్రికి వచ్చాడు. 17వ తేదీన ఆసుపత్రి వార్డు నుంచి బయటకు వెళ్లాడు. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఆహారం తింటూ ఆసుపత్రి బయటనే ఉన్నాడు.
మంగళవారం వృద్ధుడి కుటుంబ సభ్యులు అతని కోసం తెనాలి వచ్చారు. వృద్ధుడిని రోడ్డు పక్కన చూసి వెంటనే అధికారులకు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది వృద్ధుడిని ఆసుపత్రి వార్డులోకి తరలించారు. ఆసుపత్రి నుంచి కొవిడ్ రోగి బయటకు వెళ్లి తిరుగుతున్నా... సరైన పర్యవేక్షణ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి : తేనెటీగల దాడిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మృతి