నెలల తరబడి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న తమకు వేతనాలు ఇవ్వాలని.. వీరా బస్సులలో పనిచేస్తున్న కొవిడ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్లో వారు ధర్నా చేపట్టారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ప్రాణాలను పణంగా పెట్టి... ఉద్యోగం చేస్తున్నామని చెప్పారు.
వేతనాలు లేక అనేక ఇబ్బందులకు పడుతున్నామన్నారు. జీతాల కోసం... నవంబర్ 1 నుంచి పరీక్షలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. వీరా సంస్థ బస్సులను అర్థరాత్రి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సంస్థ తమకు వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. జీతాలు అడిగితే... బౌనర్లతో బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: