గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. లాక్‌డౌన్ సమయంలో నగరాల్లో విజృంభించిన కరోనా వైరస్.... ఆంక్షల సడలింపులతో పల్లెలకు పాకుతోంది. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు రాకపోకలు పెరగాయి. కేసులు నమోదును అనుసరించి ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 189 కట్టడి జోన్లుంటే..... పట్టణ, నగరాల్లో మరో 189 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా వైరస్ ప్రభావం లేదని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఊర్లలో మాస్కుల్ని విస్మరించడం, భౌతిక దూరం పాటించకపోవడం, గతంలో మాదిరే అంతా కలిసి కబుర్లు చెప్పుకోవడం ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం నుంచి గుంటూరు మార్కెట్‌కు వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
జిల్లా | కొత్తగా కరోనా సోకిన మండలాలు |
అనంతపురం | తనకల్లు, మడకశిర, కదిరి, పరిగి, గోరంట్ల |
కర్నూలు | గొనెగండ్ల , కుదుమూరు, చిప్పగిరి, ఆలూరు |
కడప | పోరుమామిళ్ల |
చిత్తూరు | వరదాయపాళ్యం, బంగారుపాళ్యం, బుచ్చినాయుడి కండ్రిగ, పుత్తూరు, రేణిగుంట, చిన్న గొట్టిగల్లు, పలమనేరు, వెంకటగిరికోట, సత్యవేడు, మదనపల్లె, నాగలాపురం, విజయాపురం, పిచ్చాటూరు, నారాయణవనం, కేవీబీ పురం, పీలేరు, సదుం |
నెల్లూరు | వింజమూరు , కలువాయి , కొడవలూరు , ఆత్మకూరు , సంగం , గూడూరు , మర్రిపాడు , దొరవారిసత్రం , రాపూరు |
ప్రకాశం | మద్దిపాడు, కొరిశపాడు , హెచ్.ఎం.పాడు, కంభం |
గుంటూరు | జిల్లాలో యడ్లపాడు , దుగ్గిరాల , గుంటూరు రూరల్ , నాదెళ్ల |
కృష్ణా | విజయవాడ రూరల్ , పెనమలూరు , ఇబ్రహీంపట్నం |
తూర్పుగోదావరి | పెద్దపూడి, బిక్కవోలు, రామచంద్రాపురం, ఏలేశ్వరం |
శ్రీకాకుళం | హిరమండలం , పాతపట్నం |
ఇదీ చదవండి