ETV Bharat / state

గుంటూరులో కరోనా కల్లోలం.. రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదు - వ్యాక్సినేషన్ ప్రక్రియ

కరోనా మలి దశలో గుంటూరులో మళ్లీ కొవిడ్ ఛాయలు అధికంగా కనిపిస్తున్నాయి. గుంటూరు నగరంలోనే సుమారు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం ఒక్కరోజే రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 279 పాజిటివ్ కేసులను గుర్తించారు.

గుంటూరులో కరోనా కల్లోలం.. రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదు

author img

By

Published : Apr 2, 2021, 3:42 AM IST

గుంటూరు జిల్లాలో మళ్లీ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా గురువారం ఒక్క రోజులోనే రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 6 రోజుల్లో మొత్తంగా 1,351 కేసులు వెలుగు చూశాయి.

నగరంలోనే 100కిపైగా..

తాజాగా ఒక్క గుంటూరు నగర పరిధిలోనే వందకుపైగా కేసులను గుర్తించారు. నగరంలో 104 కేసులు, తెనాలిలో 62 కేసులు నమోదయ్యాయి. తెనాలి 62, మంగళగిరి 31, రేపల్లె 13, చుండూరు 10, దుగ్గిరాల 10 కేసులను గుర్తించారు.

8 లక్షల మందికి టీకాలు..

తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 78 వేల 101కి చేరింది. ప్రస్తుతం జిల్లాలో 973 క్రియాశీల కేసులున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతానికి కార్యాచరణ రూపొందించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వివరించారు. 45 ఏళ్లు దాటిన సుమారు 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : విశాఖ ఉక్కు: 2020-21 టర్నోవర్‌ రూ.18వేల కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.