ETV Bharat / state

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయ్!

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటి వరకూ 314 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించారు. వారిలో 20 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మిగిలిన వారిలో 200 మందికి నెగిటివ్​ రాగా.... 94 మంది నివేదికలు రావాల్సి ఉంది.

అప్రమత్తమైన గుంటూరు జిల్లా యంత్రాంగం
అప్రమత్తమైన గుంటూరు జిల్లా యంత్రాంగం
author img

By

Published : Apr 3, 2020, 12:51 PM IST

అప్రమత్తమైన గుంటూరు జిల్లా యంత్రాంగం

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఇప్పటి వరకూ 314 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించగా... అందులో 20 పాజిటివ్​గా నిర్ధరణ అయ్యాయి. 200 మందికి నెగిటివ్ వచ్చింది. మిగిలిన 94 మంది నివేదికలు రావాల్సి ఉంది. కరోనా రోగ నిర్ధరణ పరీక్షల కోసం గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రయోగశాల రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. వైద్యకళాశాల ప్రాంగణంలోని ల్యాబ్​లోనే ఈ ప్రయోగశాల ఏర్పాటు చేశారు. రోజుకు 60 నమూనాలు పరిక్షించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 17 మంది మంగళగిరిలోని ఎన్​ఆర్​ఐ ఆసుపత్రిలో, ఇద్దరు విజయవాడ కొవిడ్-19 ప్రత్యేక వార్డులో, మరొకరు గుంటూరు ఐడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనుమానితులతో పాటు పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులను కాటూరి ఆసుపత్రి క్వారంటైన్​ సెంటర్​లో ఉంచారు. మరికొందరు ఐడీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆసుపత్రిలో 10 పడకలు పాజిటివ్ కేసుల కోసం కేటాయించారు. ఎవరికైనా పాజిటివ్ ఉన్నట్లు తేలితే వెంటనే వారిని సంబంధిత వార్డులోకి మారుస్తున్నారు.

కాటూరి ఆసుపత్రి ఐసోలేషన్​లో ఉండి పాజిటివ్ వచ్చిన వారిని ఎన్​ఆర్​ఐ ఆసుపత్రికి తరలిస్తున్నారు. జిల్లాలో 28 క్వారంటైన్ కేంద్రాలను ఇప్పటి వరకూ సిద్ధం చేయగా వాటిలో 312 మంది చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన గుంటూరు, మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు, మేడికొండూరు, మంగళగిరి ప్రాంతాలను రెడ్​జోన్లుగా ప్రకటించారు. పాజిటివ్ రోగులు నివశించిన ప్రాంతాల వైపు ప్రజలను వెళ్లనీయకుండా చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి:

కరోనా ఎఫెక్ట్‌: మంగళగిరిలో రెడ్‌జోన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.