కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడి కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే... ప్రజలు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వలస కూలీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలులో ప్రయాణికులు భౌతిక దూరం మరిచారు. బెంగళూర్ నుంచి ఒడిశా వెళుతున్న శ్రామిక్ రైలు.. గుంటూరు రైల్వే స్టేషన్లో ఆగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం సీటు సీటుకి మధ్య ఖాళీ ఉండాలి.. అయితే ఇక్కడ మాత్రం నలుగురు పక్కపక్కనే కూర్చుని ఉన్నారు.
త్వరగా గమ్యానికి చేరుకోవాలని ఒక్క ఆలోచన తప్ప.. కరోనా వైరస్ సోకుకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే నిబంధనలు పక్కన పెట్టారు. అల్పాహారం తీసుకుంటున్న సమయంలో కూడా భౌతిక దూరం మరిచి గుంపులుగా గుమిగూడారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప... వారిలో అవహగాన కల్పించటం లేదు.
ఇదీ చదవండి: పచ్చని పల్లెలకు పాకుతున్న కరోనా