ETV Bharat / state

పురుగుల మందు తాగి కరోనా బాధితుడు ఆత్మహత్య

కరోనా సోకిందని మనస్థాపానికి గురై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా వేమూరు మండలంలో జరిగింది. పోస్టమార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

author img

By

Published : May 8, 2021, 9:33 PM IST

పురుగుల మందు తాగి కరోనా బాధితుడు ఆత్మహత్య
పురుగుల మందు తాగి కరోనా బాధితుడు ఆత్మహత్య

గుంటూరు జిల్లా వేమూరు మండలంలో కరోనా సోకిందని మనస్థాపానికి గురై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాకర్లపూడి గ్రామానికి చెందిన చందు సురేశ్ కొవిడ్​ సోకడంతో జగ్గడిగుంటపాలెంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్​లో చికిత్స పోందుతున్నాడు. ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన అతను కొవిడ్ కేర్ సెంటర్​ నుంచి బయటకు వచ్చి కూచిపూడి గ్రామంలోని పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లాలో సోమవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్

కశ్మీర్​లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.