గుంటూరు జిల్లాలో కరోనా వేగంగా వ్యాప్తిస్తోంది. ఒక్కరోజే జిల్లాలో 832 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల నమోదుతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 8వేల784కి పెరిగాయి. ఇక గుంటూరు గ్రామీణ ప్రాంతాలలైన సత్తెనపల్లిలో 102, మంగళగిరిలో 92, తెనాలిలో 68, తాడేపల్లిలో 31, పిడుగురాళ్లలో 29, నరసరావుపేటలో 22, బాపట్లలో 19, పెదకాకాని, వట్టిచెరుకూరులో 13, దాచేపల్లి, మాచవరంలో 7 చొప్పున, నకరికల్లులో 6, చెరుకుపల్లిలో 5, ముప్పాళ్లలో 5, కారంపూడి, అమరావతిలో 4 , నాదెండ్ల, అమర్తలూరు 4 చొప్పున, మాచెర్ల, చేబ్రోలు, పొన్నూర్లో 3 చొప్పున, కర్లపాలెం , రాజుపాలెం, రెంటచింతల, వినుకొండ, మేడికొండూరులో 2 చొప్పున నమోదు అయ్యాయి . ఇక దుగ్గిరాల, బెల్లాంకొండ, భట్టిప్రోలు , బొల్లాపల్లి , గురజాల , నగరం , నిజంపట్నం , పెదకూరపాడు, పిట్టలవానిపాలెం, రొంపిచర్ల , శావల్యాపురం, తాడికొండ, వేమూరు ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రిటర్న్- 1, హోం క్వారంటైన్ - 8 కేసులు నమోదు అయినట్లు అధికారాలు తెలిపారు.
ఇదీ చూడండి. 'మహిళ మృతి వాస్తవమే... ఆలస్యం అయిందనడమే అవాస్తవం'