ETV Bharat / state

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ.. ఒక్క రోజే 1184 కేసులు..

ఒకట్లు.. పదులు.. వందలు.. వేలు... గుంటూరు జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన రోజువారీ కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తీరిది. తొలినాళ్లలో ఒక్క కేసు నమోదైతేనే జిల్లా ప్రజానీకం ఉలిక్కిపడింది. యంత్రాంగం ఆందోళన చెందింది. తాజాగా వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. కానీ ప్రజలు, యంత్రాంగం అప్రమత్తం కావడం లేదు. సమయపాలన లేకుండా ప్రజలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. పదుల సంఖ్యలో కేసులు వచ్చినప్పుడు రెడ్‌, కంటైన్మెంట్​ జోన్లు, క్లస్టర్ల నుంచి ప్రజలను బయటకు రానీయకుండా కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం వేలల్లో కేసులు వచ్చిపడుతున్నా నివారణకు సరైన ప్రణాళికతో కదలడం లేదు.

author img

By

Published : Jul 24, 2020, 1:55 PM IST

corona increasing at guntur district
గుంటూరులో కరోనా

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే 1184 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు నగరంలో 594 వచ్చాయి. ఇప్పటి దాకా జిల్లాలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 8097కు చేరాయని రాష్ట్ర హెల్త్‌బులెటిన్‌ పేర్కొంది. వీరిలో 3861 మంది చికిత్స పొందుతుండగా 4151 మంది డిశ్ఛార్జి అయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు వైరస్‌తో చనిపోయినవారి సంఖ్య 85కు చేరింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం పాజిటివ్‌ కేసులు 10 వేలకు చేరువై ఉండొచ్చని తెలుస్తోంది.

  • పెరిగిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు..

గతంలో సరాసరి రోజుకు 2 వేల వరకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా ప్రస్తుతం అది రెట్టింపు అయింది. గతంలో ట్రూనాట్‌, ఆర్టీపీసీఆర్‌తో సరిపుచ్చగా ప్రస్తుతం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లతో పాటు ఆర్టీసీ సంచార వాహనం, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లోనూ నమూనాలు సేకరించి పరీక్షలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. పర్యవసానంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

బాధితులకు వైద్య సేవలు అందించడానికి, అనుమానితులకు సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటానికి గుంటూరు జీజీహెచ్‌, తెనాలి జిల్లా ఆసుపత్రులతో పాటు ఎన్నారై, మణిపాల్‌, డీవీసీ, లలితా సూపర్‌స్పెషాలిటీ, కాటూరి వైద్య కళాశాలతోనూ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. వీటన్నింటిలో కలిపి 5 వేల పడకలను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆయా ఆసుపత్రుల్లో 3861 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కేసులు అధికమవుతుండటంతో నరసరావుపేట ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చాలని యంత్రాంగం యోచిస్తోంది. మొత్తంగా కేసులు 10 వేలకు చేరువకానుండటంతో యంత్రాంగాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. లాక్‌డౌన్‌లో గుంటూరు, నరసరావుపేటలో కేసులు విజృంభించాయి. ఇప్పుడు మరలా కేసులు పెరుగుతున్నాయి. అదేవిధంగా కాకుమాను, ప్రత్తిపాడు, రేపల్లె, పిడుగురాళ్ల, పొన్నూరులో పెద్దసంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ ప్రకారం..

గుంటూరు నగరం 594, అమరావతి 6, బాపట్ల 10, బెల్లంకొండ 2, భట్టిప్రోలు 3, బొల్లాపల్లి 1, చేబ్రోలు 7, చెరుకుపల్లి 2, చిలకలూరిపేట 34, దాచేపల్లి 4, దుగ్గిరాల 8, దుర్గి 5, యడ్లపాడు 12, గుంటూరురూరల్‌ 4, గురజాల 1, కాకుమాను 21, కర్లపాలెం 1, కొల్లిపర 3, కొల్లూరు 6, మంగళగిరి 34, మాచర్ల 2, మాచవరం 2, ముప్పాళ్ల 16, నగరం 1, నకరికల్లు 2, పెదకాకాని 6, పెదకూరపాడు 1, పిడుగురాళ్ల 69, పొన్నూరు 13, ప్రత్తిపాడు 22, రాజుపాలెం 3, రొంపిచర్ల 4, రెంటచింతల 3, రేపల్లె 15, సత్తెనపల్లి 59, శావల్యాపురం 3, తాడేపల్లి 29, తాడికొండ 9, తెనాలి 2, చుండూరు 9, వినుకొండ 2.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. కళ్లముందే ప్రాణాలు పోయాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.