కరోనా కేసుల కారణంగా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. రోజు తప్పించి రోజు మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని సూచించారు. సరిసంఖ్య తేదీల్లో మాత్రమే ప్రజలు సరకులు కొనుగోలు చేయాలని కోరారు. బేసి సంఖ్య తేదీల్లో నిత్యావసర సరకుల దుకాణాలు మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కొనుగోలుకు వెసులుబాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనా కలవరం.. రాష్ట్రంలో కొత్తగా 7 కేసులు నమోదు