ETV Bharat / state

చిలకలూరిపేటలో కరోనా కలకలం.. ఒక్కరోజే 9 కేసులు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే నియోజకవర్గంలో 9 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, తెనాలిలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఈ కేసులతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 448కి చేరింది. గుంటూరు మిర్చి యార్డులో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు రైతులు, వ్యాపారులు కరోనా నివారణ చర్యలు చేపట్టాలని యార్డు ఛైర్మన్ ఏసురత్నం సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు.

చిలకలూరిపేటలో కరోనా కలకలం.. ఒక్కరోజే 9 కేసులు
చిలకలూరిపేటలో కరోనా కలకలం.. ఒక్కరోజే 9 కేసులు
author img

By

Published : May 28, 2020, 8:33 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నెల 23 వరకు ఒక్క కేసు నమోదు కాగా.. వారం రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 12కు చేరింది. గత నెలలో నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలికి కరోనా రావటంతో ఆమెను ఐసోలేషన్​కి తరలించారు.

ఈనెల 23న నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడికి మరణానంతరం పరీక్షల్లో కరోనా ఉన్నట్లు తేలింది. అతని అంత్యక్రియల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. చిలకలూరిపేట చిన్న పీర్ సాహెబ్ వీధిలో ఉన్న ఒక మహిళకు 25వ తేదీన పాజిటివ్ నిర్ధరణ అయింది.

ఈ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు చేయగా... చిలకలూరిపేటలో ముగ్గురు, యడ్లపాడు మండలంలో నలుగురు, నాదెండ్ల మండలంలో ఇద్దరికి కరోనా సోకినట్లు ఫలితాల్లో తేలింది. బుధవారం ఒక్కరోజులోనే నియోజకవర్గంలో తొమ్మిది పాజిటివ్ కేసులు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

గుంటూరులో..

గుంటూరు శ్రీనివాసరావుతోటలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తాజాగా నమోదైన కేసుతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 448కి పెరిగింది. గుంటూరులో ఇప్పటివరకు 183 కేసులు రాగా, హాట్ స్పాట్ నరసరావుపేటలో 190 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య పెరుగుతుంది.

తెనాలిలో..

గుంటూరు జిల్లా తెనాలి నాజర్ పేటకు చెందిన వ్యక్తికి రెండోసారి జరిపిన కరోనా నిర్ధరణ పరీక్షల్లోా పాజిటివ్ వచ్చిందని తెనాలి డివిజనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరసింహ నాయక్ తెలిపారు. తమిళనాడు కోయంబేడు మార్కెట్​కి వెళ్లి వచ్చిన ఆ వ్యక్తికి ఈ నెల 13న తొలిసారి చేసిన పరీక్షలో పాజిటివ్ రాగా, ఆ నమూనాలు గుంటూరుకు పంపగా నెగిటివ్ వచ్చిందన్నారు. ఆయన్ను క్వారంటైన్​కి తరలించారు. ఈ నెల 25న మరోసారి చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని నరసింహనాయక్ తెలిపారు. ఈ కేసుతో తెనాలిలో కరోనా పాజిటివ్ కేసులు ఆరుకు చేరాయి.

మిర్చి యార్డులో నివారణ చర్యలు
గుంటూరు మిర్చి యార్డులో కార్యకలాపాలు సజావుగా జరగడంతో పాటు... కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తున్నట్లు యార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. బుధవారం ఆయన మిర్చి యార్డులో పర్యటించారు. వ్యాపారులతో పాటు హమాలీలు, రైతులు, మార్కెట్ యార్డు సిబ్బంది మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మాస్కులు లేని రైతులకు యార్డు తరఫున మాస్కులు అందజేశారు. రైతులు, వ్యాపారులు షాపుల వద్ద సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అన్ని దుకాణాల్లో శానిటైజర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.

ఇదీ చదవండి:

అన్నమయ్య భవనంలో నేడు తితిదే మండలి సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.