గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా పాజిటివ్ నివేదికలో... నేడు 9 కేసులు నమోదు కాగా.. అందులో ఒకటి నరసరావుపేటలో నమోదైంది. దీంతో ఇప్పటివరకూ పట్టణంలో 174 కరోనా కేసులు నమోదయ్యాయి.
అధికారులు మిషన్ మే 15 స్లోగన్‌తో... మే15 నాటికి కరోనా కేసులు జీరోస్థాయికి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ పట్టణంలో కేసులు మాత్రం ఆగటం లేదు. సుమారు రెండు రోజులకు ఒక కేసు అయిన నమోదవుతూనే ఉంది. అదీ కొత్త ప్రాంతాలలో నమోదవడం అధికారులను కొంతమేర కలవరపెడుతోంది.
ఈ పరిణామాలు మారాలంటే ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రావడం, మాస్క్ లు ధరించక పోవడం లాంటివి చేయకుండా అధికారులు సూచించిన ఆదేశాలను పాటించాలన్నారు.