గుంటూరు జిల్లాలో 41 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో అధికారులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో పాజిటివ్ కేసులు 25కు చేరుకోవటం కలవరపెడుతోంది. ఇప్పటికే 9 కాలనీలను రెడ్ జోన్లుగా ప్రకటించి.. అక్కడ లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేశారు. నగరపాలక సంస్థ తరఫున పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల ద్వారా క్రిమిసంహారక మందులు చల్లుతున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించి అనారోగ్యంతో ఉన్నవారి వివరాలు ఆరా తీస్తున్నారు.
కూరగాయల మార్కెట్లలోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. అలాగే మార్కెట్లోకి ప్రవేశించే సమయంలోనే శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేశారు. నగరంలోని మిగతా ప్రాంతాల్లో సైతం ఉదయం 9గంటల వరకే ప్రజల్ని బయటకు అనుమతిస్తున్నారు. అత్యవసర పనులపై బయటకు వచ్చేవారిని మాత్రమే వెళ్లనిస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 15 కరోనా పాజిటివ్ కేసులు