ETV Bharat / state

గుంటూరులో కొత్తగా 730 కరోనా కేసులు.. ప్లాస్మా థెరపీపై అధికారుల దృష్టి

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం నాడు జిల్లాలో 730మంది కొవిడ్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఒకేరోజున 16మంది మరణించటం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో జిల్లాలో కొవిడ్ రోగులకు ప్లాస్మా చికిత్స అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

corona cases in guntur district
గుంటూరులో కరోనా కేసులు
author img

By

Published : Aug 5, 2020, 10:51 PM IST

రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు గుంటూరు జిల్లా యంత్రాంగానికి సవాల్​గా మారాయి. బుధవారం కొత్తగా 730 కేసులు రాగా.. మొత్తం కేసుల సంఖ్య 20,170కు చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 242 నమోదయ్యాయి. మాచర్ల 102, నర్సరావుపేట 50, తెనాలి 46, బాపట్ల 40, పొన్నూరు 37, సత్తెనపల్లి 30, నకరికల్లు 16, పిడుగురాళ్ల 12, అమరావతి 14, రొంపిచెర్ల 12, చిలకలూరిపేట 12, దుగ్గిరాల 11, నాదెండ్ల 9, ఫిరంగిపురం 9 కేసులు వచ్చాయి. మిగతా ప్రాంతాల్లో 124 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ప్లాస్మా థెరపీపై దృష్టి

జిల్లాలో కరోనా నుంచి కోలుకుని 11,374 మంది ఇళ్లకు వెళ్లారు. ఇప్పటివరకు 179 మంది మరణించారు. ఇందులో 16 మంది బుధవారం ఒక్కరోజే మృతిచెందారు. దీంతో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చటంతో పాటు కొత్తగా ప్లాస్మా థెరపీని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం కొవిడ్ విజేతల నుంచి ప్లాస్మా సేకరణ ప్రారంభించారు. రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాల్లో ప్లాస్మా సేకరించేలా ఏర్పాట్లు చేశారు. ఎవరికి ప్లాస్మా చికిత్స చేయాలో నిర్ణయించేందుకు జిల్లా స్థాయిలో వైద్య నిపుణులతో 2 కమిటీలు వేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు ప్లాస్మా థెరఫీ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

కొవిడ్ విజేతలు ముందుకురావాలి

కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న తర్వాత.. వైరస్ సోకిన 28వ రోజు నుంచి 60 రోజుల వరకు ప్లాస్మా దానం చేయవచ్చు. 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల వయసు వారు ముందుకొచ్చి ప్లాస్మా ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. కొవిడ్ మరణాల సంఖ్యను తగ్గించేందుకు ఈ చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.

కరోనా కేసుల్లో అత్యధికంగా గుంటూరులోనే 8వేలు నమోదయ్యాయి. అందులో 6 వేల కేసులు యాక్టివ్ దశలోనే ఉన్నాయి. నరసరావుపేటలో 1250 కేసులు వచ్చాయి. తాడేపల్లిలో 859, సత్తెనపల్లిలో 700 కేసులు ఉన్నాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 9వేలకు పైగా కేసులు ఇప్పటి వరకూ నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 35 ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు వైద్యం అందుతోంది. 3వేల మందికి పైగా ఆసుపత్రుల్లో ఉండగా.. మిగతా వారు కోవిడ్ కేర్ కేంద్రాల్లో, మరికొందరు హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స పొందుతున్నారు. అవసరాన్ని బట్టి ఆసుపత్రుల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి... '

రామయ్యా...మోదీ మనసు మార్చవయ్యా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.