ETV Bharat / state

ఆగని కరోనా కేసులు... సడలింపులతో సవాల్

గుంటూరు జిల్లాలో ఆదివారం రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 568కి చేరింది. తాజాగా గుంటూరు సీతానగరం, దుగ్గిరాలలో ఒక్కో కేసు నమోదైంది.

corona cases in guntur district
గుంటూరులో కరోనా కేసులు
author img

By

Published : Jun 7, 2020, 7:00 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 568కి చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో గుంటూరు రెండోస్థానంలో ఉంది. ఇన్నాళ్లూ పట్టణ ప్రాంతాలను కుదిపేసిన కోవిడ్ వైరస్.. ఇప్పుడు పల్లెప్రాంతాలకు విస్తరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం గుంటూరులో 215, నర్సరావుపేటలో 200, తాడేపల్లిలో 22 కేసులున్నాయి. ఇవాళ వెల్లడించిన 2 కేసులు గుంటూరు సీతానగరం, దుగ్గిరాలలో నమోదయ్యాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపుతో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం యంత్రాంగానికి సవాల్​గా మారింది.

రేపటి నుంచి షాపింగ్ మాల్స్, హోటళ్లు, ప్రార్థనాలయాలకు ప్రభుత్వం అనుమతించింది. మాల్స్,హోటళ్లు, ప్రార్దనా మందిరాలలో భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలని... కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు తెలిపేలా బోర్డులు ఉంచాలని...., ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేశాకే లోపలికి అనుమతించాలని గుంటూరు జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: ఆమె ట్రాక్టర్​.. బతుకు మడిలోని కష్టాల్ని దున్నేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.