గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొత్తగా మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అధికారులు విడుదల చేసిన నివేదికలో 90 కేసులు నమోదు కాగా... వాటిలో 14 నరసరావుపేటలోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో కొత్తగా 11 కేసులు ఏనుగుల బజారులో నమోదుకాగా... వరవకట్ట, శ్రీ రాంపురం, ప్రకాష్ నగర్లలో ఓ కేసు చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటితో నరసరావుపేట మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 251కు చేరుకున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
ఇదీ చూడండి..