ETV Bharat / state

'నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు..' - east godavari updates

రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రజలకు అధికారులు కరోనాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

corona awareness program in ap
కరోనాపై అవగాహన
author img

By

Published : Apr 21, 2021, 2:00 PM IST

పలు జిల్లాల్లో అధికారులు కరోనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కృష్ణా జిల్లాలో..

ఆసియాలోనే అతిపెద్ద మామిడి మార్కెట్​లో ఒకటైన విజయవాడ నున్న మాంగో మార్కెట్​లో దుకాణదారులకు, కూలీలకు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లకు కొవిడ్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గుంటూరు జిల్లాలో..

కరోనా కేసులు పెరుగుతున్నందున బాధితులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా పలు భవనాలను పరిశీలించారు. హోం క్వారంటైన్​లో ఉండేందుకు సదుపాయాలు లేని వారి కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

చిలకలూరిపేటలో కరోనా మహమ్మారిపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వాడాలని సుజాత కోరారు. బుధ‌వారం నుంచి అన్ని హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లో కేవ‌లం పార్శిల్స్‌కు మాత్ర‌మే అనుమతినిచ్చారు. రేపల్లెలో నేటి నుంచి అత్యవసర దుకాణాలు మినహా అన్ని రకాల దుకాణాలను మధ్యాహ్నం 2 గంటలకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని.. మే 2వ తేదీ వరకు నియంత్రణ చర్యలు పటిష్ఠంగా అమలు చేయనున్నట్లు ఎమ్మార్వో విజయ శ్రీ తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా జిల్లాలోని అమలాపురం సమీపంలోని బోడసకుర్రులో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ వెల్లడించారు. భవనంలో మౌలిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

ఇదీ చదవండి

సత్తెనపల్లిలో నేటి నుంచి కరోనా అంక్షలు

సెకండ్ వేవ్: నరసరావుపేటలో గురువారం నుంచి లాక్​డౌన్

రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభణ... అప్రమత్తమైన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.