ETV Bharat / state

Contract Employees Protest: ఏపీలో అన్నీ అశాశ్వత ఉద్యోగాలే..! కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన.. నాలుగేళ్లుగా నానావస్థలు.. - ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ న్యూస్

Contract Employees Protest: వైద్యారోగ్య శాఖలో ఎన్నడూ లేని విధంగా భారీగా నియామకాలు చేపట్టామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. భర్తీ చేసిన ఉద్యోగాల్లో.. ఒప్పంద, పొరుగు సేవల కింద చేపట్టినవే అధికంగా ఉన్నాయి. విధుల్లో చేరిన వారు ఉద్యోగ భద్రతపై.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పోస్టులు కూడా.. భర్తీ చేసిన ఒప్పంద, పొరుగు సేవ ఉద్యోగాల్లో ఉన్నాయి. కొత్తగా సృష్టించిన పోస్టులు పరిమితంగానే ఉన్నాయి.

Contract_Employees_Protest
Contract_Employees_Protest
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 7:06 AM IST

Updated : Sep 4, 2023, 11:19 AM IST

Contract_Employees_Protest: ఏపీలో అన్నీ అశాశ్వత ఉద్యోగాలే..! కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన

Contract Employees Protest: వైద్యారోగ్య శాఖలో శాశ్వత విధానంలో నియామకాలు జరిగితే ఉద్యోగ భద్రత పెరిగి ఆసుపత్రుల్లో రోగులకు సేవలు మెరుగుపడే అవకాశం ఉంది. దీనికి భిన్నంగా నియామకాలు ఒప్పంద, పొరుగు సేవల కింద చేపడుతుండటంతో.. ఉద్యోగాల్లో ఎంత కాలం కొనసాగే అవకాశం ఉంటుందో తెలియక విధుల్లో చేరిన వారు ఆయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. శాశ్వత విధానంలో చేరిన వారి కంటే వీరికి వేతనాల పెంపు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు తక్కువగా ఉంటున్నాయి.

నియామకాల నోటిఫికేషన్లు జారీ జరిగినప్పుడు కొందరు వెళ్లిపోతున్నారు. ఒప్పంద, పొరుగు సేవల నియామకాలతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. విధుల్లో చేరి మధ్యలోనే మానేసిన వారి వివరాలు సేకరించి మళ్లీ భర్తీ చేయడం.. వైద్య ఆరోగ్య శాఖలో ప్రహసనంగా మారుతోంది. అంతేకాకుండా ఈ నియామకాలు రోగుల అవసరాలకు తగినట్లుగా జరిగాయా? వారి సమస్యలు, బాధలు తగ్గాయా? లేదా? ఇంకా ఎటువంటి చర్యలు ఎసుకోవాలన్న దానిపై ఆసుపత్రుల వారీగా సమీక్షలు జరగడం లేదు. నియమకాలపై గొప్పగా చెప్పుకోవడమే తప్ప సమీక్షలు, సర్దుబాటు చర్యలు అరకొరగా ఉన్నందున ఇప్పటికీ పలు సమస్యలు రోగులను వేధిస్తూనే ఉన్నాయి.

Contract Professors Protest కాంట్రాక్టు అధ్యాపకులను నిలువునా ముంచేసిన వైసీపీ సర్కార్..

Contract Employees in Health Department: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద.. 5వేల 986 వైద్యుల పోస్టులు మాత్రమే శాశ్వత విధానం ద్వారా చేపట్టారు. వీటిలో ప్రస్తుతం 890 వరకు ఖాళీగా ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల కోసం.. 13వేల 540 ఏఎన్ఎం ఉద్యోగాలను భర్తీ చేశారు. వీటిని సచివాలయ ఉద్యోగాల భర్తీ సంఖ్యలోనూ చూపిస్తున్నారు. ఇలా వివిధ విభాగాలకు సంబంధించి 53 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగింది.

శాశ్వత ఉద్యోగాలను.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో భర్తీ చేస్తుండటం వల్ల ఉద్యోగులు పనిచేసినంత కాలం వేతనాల పెంపు నుంచి ఇతర విషయాల వరకు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. శాశ్వత విధానంలో పనిచేసే వారికి, ఒప్పంద విధానంలో పనిచేసే వారి వేతనం మధ్య కనీసం 30 నుంచి 40శాతం వరకు వ్యత్యాసం ఉంటోంది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్నారన్న కారణంతో వీరు సంక్షేమ పథకాలకూ దూరమవుతున్నారు.

జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రంలో సుమారు 20 వేల మంది పనిచేస్తున్నారు. వీరికి ఏటా వార్షిక వేతనం పెంపు జరగడం లేదు. ప్రతి సంవత్సరం వేతన పెంపు జరగాలని మార్గదర్శకాలున్నా నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగింది. దీనిపై ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనలు చేయడంతో.. ఇటీవల దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఉద్యోగాలు పొందిన వారి పనితీరును పరిశీలించిన అనంతరమే.. ఏటా రెన్యువల్ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించడంతో ఆందోళన చెందుతున్నారు.

RTC Contract Employees Agitation In Vijayawada: హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు: ఆర్టీసీ ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు

జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేసే వారికి కేంద్రం నుంచి 60:40 నిష్పత్తిలో వచ్చే నిధుల నుంచే వేతనాల చెల్లింపులు జరుగుతున్నాయి. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ పోస్టుల భర్తీ జరిగింది. గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్న వారికి ఈ మధ్యకాలంలో వేతనాలు చెల్లింపులు సకాలంలో జరగడం లేదు. ప్రతినెలా వేతనాలు చెల్లింపులకు అవసరమైన నిధుల కోసం అధికారులు వెంపర్లాడాల్సి వస్తోంది. 10 వేల రూపాయల వరకు ఉన్న ఎమ్ఎల్​హెచ్​పీలకు వేతనంతో పాటు వారి పనితీరును అనుసరించి ప్రతినెలా ప్రత్యేకంగా అలవెన్సులు ఇవ్వాలి.

ఆరేడు నెలల నుంచి కొందరికి ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, ఇతర కేటగిరిల వారికి ఏజెన్సీల నుంచి.. 2, 3నెలలకోసారి వేతనాల చెల్లింపులు జరుగుతున్నాయి. వేతనాల పెంపులోనూ అన్యాయం జరుగుతుందని కార్మికులు విజయవాడలో తాజాగా ఆందోళనకు దిగారు. పోస్టులను భర్తీ చేస్తున్నామని చెబుతున్నారే కానీ.. రోగులకు సేవలు అందుతున్నాయా? లేదా? అన్న అంశంపై సమీక్ష జరగడం లేదు.

వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో.. 7వేల 767 ఉద్యోగ నియామకాలు జరగ్గా శాశ్వత విధానంలో కేవలం 2వేల 537 పోస్టులు భర్తీ చేశారు. 15వందల 19 ఉద్యోగాలు ఒప్పంద, 3వేల 711 పొరుగు సేవల విధానంలో నియామకాలు జరిగాయి. ఇప్పటికీ వివిధ ఉద్యోగాలకు సంబంధించి 550 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు వైద్యులను ఒప్పంద విధానంలో భర్తీ చేస్తున్నారు. దీనివల్ల వైద్యుల నియామకాల నోటిఫికేషన్లు జారీ జరిగినప్పుడు పలువురు ఎంపికవుతున్నారు. కొందరు పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారు. దీని ప్రభావం రోగులకు అందించే వైద్య సేవలపై పడుతోంది.

Power Employees Protest: ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె.. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల అల్టిమేటం

Last Updated : Sep 4, 2023, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.