ETV Bharat / state

ఉపాధి లేక.. పండ్లు అమ్ముకుంటున్న తాపీ మేస్త్రి! - అప్పుడు ఇసుక .. ఇప్పుడు కరోనా దెబ్బ

లాక్ డౌన్ ప్రభావం.. ఉపాధిని పొగొట్టింది. గుంటూరు జిల్లాలో ఓ తాపీ మేస్త్రిని పండ్ల విక్రేతగా మార్చింది.

construction worker turned as fruit vendor due to lock down
అప్పుడు ఇసుక .. ఇప్పుడు కరోనా దెబ్బ
author img

By

Published : May 16, 2020, 11:16 AM IST

కరోనా లాక్ డౌన్ తెచ్చిపెట్టిన కష్టంతో కొందరు తమ వృత్తులు, ఉపాధి మార్గాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరులోని నల్లెచెర్వుకు చెందిన తాపీమేస్త్రి మాల్యాద్రికీ అదే పరిస్థితి ఎదురైంది. భవన నిర్మాణ పనులు లేని కారణంగా.. పొట్ట కూటి కోసం ఊరూరూ తిరిగి పండ్లు అమ్మకుంటున్నాడు.

నెల రోజుల నుంచి ఉదయాన్నే మార్కెట్ కు వెళ్లి పండ్లు కొనుగోలు చేసి నగరంలో తిరుగుతూ విక్రయిస్తున్నారు. అప్పట్లో ఐదారు నెలలు ఇసుక కొరతతో పని లేకుండా పోయిందని... ఆ తర్వాత నిర్మాణాలు మొదలైన కొద్ది నెలలకే కరోనా కారణంగా మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయని ఆవేదన చెందాడు. ప్రస్తుతం మామిడి పండ్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతో ఎలాగోలా కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు తెలిపాడు.

ఇదీ చదవండి:

కాటన్ దొరకు నివాళులర్పించిన చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.