గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వడ్డవల్లి గ్రామంలో అన్నదమ్ముల మధ్య వివాదం జరిగింది. గ్రామానికి చెందిన చిమట నర్సయ్య, గంపదత్తులు వరసకు సోదరులు. పండుగ సందర్భంగా వీరిరువురూ మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వివాదం పెరిగింది. ఒకరినొకరు కత్తిపీటలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరస్పర ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీచదవండి.