వైకాపా ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గుంటూరులో అభినందన సభ నిర్వహించారు. ఆయన చిన్ననాటి, రాజకీయ స్నేహితులు ఈ కార్యక్రమం చేపట్టారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన మిత్రులు ఆకాంక్షించారు.
నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయాలని కోరారు. డొక్కాకు శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి...
నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో విషవాయువు లీకేజీ.. ఒకరు మృతి