గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రెడ్ జోన్లుగా ఏర్పాటు చేసిన వరవకట్ట, రామిరెడ్డిపేట పరిసర ప్రాంతాల్లో కరోనా కట్టడికి అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కీలక సూచనలు చేశారు. ఇప్పటి వరకూ పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు 60 నమోదైనట్లు తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాలలో 300 మందిని గుర్తించి వారి నమూనాలు సేకరించామన్నారు. వాటి నివేదికలు ఇంకా రావల్సి ఉందని చెప్పారు.
ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా మహమ్మారి దరిచేరకుండా ఉండాలంటే అందరూ ఇళ్లకు పరిమితమై బయటకెవరూ రాకుండా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతతో ఉండాలన్నారు. నరసరావుపేట డివిజన్ లో ఈ నెల 29, 30 వ తేదీల్లో పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ రెండు రోజులు ప్రజలు బయటకు రాకుండా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: