గుంటూరు జిల్లాలో అత్యధికంగా కోరనా కేసులు నమోదైన నరసరావుపేటలో అధికారులు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నరసరావుపేటలో రేపు, ఎల్లుండి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. నిత్యావసరాల కోసం ఇచ్చే మూడు గంటల వెసులుబాటూ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. గుంటూరులో కేసులన్నీ రెడ్‌జోన్లలోనే నమోదు కాగా.. నరసరావుపేటలో రెడ్‌జోన్లతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చూడండి