గుంటూరు జిల్లాలో వందేళ్ల నాటి పురాతన వంతెన కూలిపోయింది. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద సాగునీటి కాలువ బ్రిడ్జ్ పై.. బ్లీచింగ్ పౌడర్ లోడుతో అవనిగడ్డకు చెందిన లారీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వంతెన కూలిపోగా.. లారీ వెనుక భాగం కాలువలోకి జారిపోయింది. ముందుభాగం మాత్రం రోడ్డుపైనే ఉంది. డ్రైవర్ ఎలాంటి గాయాలు కాకుండా బయపడ్డాడు.
అధిక లోడుతో వెళ్లిన కారణంగానే ఘటన జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. బ్రిటీష్ హయాంలో నిర్మించిన వంతెనకు ఇటీవలే మరమ్మతులు చేశారు. అవనిగడ్డకు వెళ్లేందుకు వెల్లటూరు మీదుగా వేరే రోడ్డు ఉన్నా దగ్గరి దారి కావడం వల్లే.. డ్రైవర్ ఈ మార్గంలో వెళ్లినట్టు చెప్పాడు. భట్టిప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ ద్వారా లారీని బయటకు లాగేందుకు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి:
రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఏపీ నుంచి వెళ్లే వాహనాలు నిలిపివేత..