సీఎం సహాయనిధి పేదలకు పెన్నిధిలాంటిదని ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. చిలకలూరిపేట వైకాపా కార్యాలయంలో 203 మంది బాధితులకు రూ36.25 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో వైద్యం కోసం గతంలోలాగా ఇప్పుడు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేదని చెప్పారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
ఇదీ చదవండి: Farmers problems: కౌలు భూములపై ఆసక్తి చూపని అన్నదాత