ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. సీఎం హెలీప్యాడ్ ల్యాండింగ్ ప్రాంతమైన ఎస్ఎస్ఎన్ కళాశాలతోపాటు సభా ప్రాంగణమైన కోడెల స్టేడియంలో.. స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పర్యటించారు. సీఎం పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: తనపై నమోదైన కేసు కొట్టేయాలని.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్