CM Jagan tour in guntur: ముఖ్యమంత్రి జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. విద్యానగర్‌లో ఐటీసీ సంస్థ నిర్మించిన స్టార్ హోటల్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు చేరుకోనున్నారు. పోలీస్ మైదానంలో హెలిప్యాడ్ వద్ద దిగి.. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా హోటల్‌కు బయలుదేరతారు. 11గంటలకు హోటల్ ను ప్రారంభించనున్నారు. అక్కడ 45 నిమిషాల పాటు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరుతారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
ముఖ్యమంత్రి పర్యటన కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. హెలిప్యాడ్‌తో పాటు హోటల్ వద్ద పనులను అధికారులు పూర్తి చేశారు. మంత్రులు సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు.. ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులు గుంటూరు నగరంలో హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం పర్యటన సందర్భంగా గుంటూరు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టరేట్, పట్టాభిపురం, స్థంబాలగరువు, గుజ్జనగుండ్ల, విద్యానగర్ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి:
Jagananna Smart Township Launched: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరబోతుంది: సీఎం జగన్