ETV Bharat / state

మహిళల భద్రతకు ఈ-రక్షాబంధన్​: సీఎం జగన్ - e- raksha bandhan portal news

మహిళలపై సైబర్‌ నేరాల నిరోధానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. సైబర్‌ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా 'ఈ-రక్షాబంధన్' పేరుతో పోర్టల్​ను ప్రారంభించింది. దీనిని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.

cm jagan
cm jagan
author img

By

Published : Aug 3, 2020, 7:02 PM IST

Updated : Aug 4, 2020, 2:49 AM IST

మహిళల రక్షణ కోసం 'ఈ–రక్షా బంధన్‌' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దీనిని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు, విద్యార్థినులు, ఉద్యోగినులు సీఎంకు రాఖీ కట్టారు. అనంతరం ఈ-రక్షాబంధన్​ను సీఎం ప్రారంభించారు.

రాఖీ పండుగ సందర్భంగా రెండు కార్యక్రమాలు మొదలుపెట్టామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇదివరకే అమూల్‌తో ఒప్పదం చేసుకోగా... సోమవారం వైయస్సార్‌ చేయూత, ఆసరా కార్యక్రమాలకు సంబంధించి హిందుస్థాన్‌ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్‌ గాంబల్, ఐటీసీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రాఖీ పండుగ రోజున మరో కార్యక్రమం కింద 4s4u.appolice.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్‌ ఛానల్​లో రకరకాల నిపుణులతో అవగాహన కల్పిస్తామన్నారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నందున వీటి వల్ల మంచి, చెడు ఏంటి? సైబర్‌, వైట్‌కాలర్‌ నేరాలు జరిగితే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈ రక్షా బంధన్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తారు. ఏ యాప్‌ల వల్ల ఇబ్బందులు వస్తాయో వివరిస్తారు. నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలన్న దానిపైనా అవగాహన కల్పిస్తారు. మహిళలు దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవడం, దిశ కాల్‌ సెంటర్‌కు ఫోన్ చేయడం, సైబర్‌మిత్ర వాట్సాప్‌ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చు. ఇవి కాకుండా దిశ పోలీస్‌ స్టేషన్లలోనూ ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్య తీసుకుంటారు. తద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతుంది

-జగన్, ముఖ్యమంత్రి

నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లు

ఈ నెల 12న వైఎస్​ఆర్​ చేయూత ప్రారంభిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేల చొప్పున అందిస్తాం. సెప్టెంబరులో వైఎస్​ఆర్​ ఆసరా అమలు చేస్తాం. 9 లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన 90 లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తాం. చేయూత పథకం అందుకుంటున్న మహిళల్లో చాలా మందికి ఆసరా కూడా వర్తిస్తుంది. ఏటా దాదాపు రూ.6,700 కోట్లు ఆసరా కింద ఇస్తాం. ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి రూ.11 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.44 వేల కోట్లను కోటి మంది మహిళలకు అందిస్తాం.

- జగన్​, సీఎం

మార్కెటింగ్​ పరంగా ఏపీ ముఖ్యం

తయారీ రంగంలోనే కాదు.. మార్కెటింగ్​ పరంగానూ ఏపీ తమకు చాలా ముఖ్యమని హెచ్​యూఎల్​ ఎండీ సంజీవ్​ మెహతా అన్నారు. ఒప్పందాలు కుదిరిన అనంతరం మాట్లాడిన ఆయన.. వాటర్​షెడ్​, సామాజిక అడవులు, పారిశుద్ధ్యం, ఆరోగ్య రంగంలోనూ తమ వంతు సాయం అందిస్తామని ఐటీసీ ఛైర్మన్​, ఎండీ సంజీవ్​ పూరీ అన్నారు. శిక్షణ కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది విద్యార్థులకు తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తోందని వైఎస్​ ఆర్​ చేయూతలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని ప్రొక్టర్​ అండ్​ గాంబెల్​ సంస్థ సీఈవో, ఎండీ మధుసూదన్​ గోపాలన్​ పేర్కొన్నారు.

హెచ్​యూఎల్​ జీఎస్​ఎం రామకృష్ణారెడ్డి, సెర్ప్​ సీఈవో రాజాబాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్​ నీలంసాహ్ని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

రాష్ట్రంలో కరోనా విజృంభణ... మరో 7822 కరోనా కేసులు

Last Updated : Aug 4, 2020, 2:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.