CM Jagan laid Virtual Foundation Stone for 6 Food Processing Industry Projects : నాలుగున్నర సంవత్సరాల్లో 130 కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటు చేయగలిగామని, తద్వారా 69 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కొన్ని పరిశ్రమలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ (Global Investment Summit)లో భాగంగా చేసుకున్న ఒప్పందాలకుగానూ 9 ప్రాజెక్టులు పెట్టుబడులకు ముందుకు వచ్చాయని సీఎం వివరించారు. 422 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 6 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం : నెల్లూరు జిల్లాలో ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, ఏలూరు జిల్లా ఆగిరిపల్లెలో మొక్కజొన్న ఆధారిత పరిశ్రమ, విజయనగరం జిల్లాలో మిల్లెట్, బంగాళాదుంప, కర్నూలు జిల్లాలో టమాటో ప్రాసెసింగ్ యూనిట్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అలాగే మరో నాలుగు పరిశ్రమలకూ సీఎం శంకుస్థాపన చేశారు. పరిశ్రమల ఏర్పాటులో కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. అదే సమయంలో ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉందని పారిశ్రామిక వేత్తలు గుర్తించాలని కోరారు.
YS Jagan: చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు సీఎం జగన్ భూమిపూజ
జగన్‌తో భేటీ అయిన పెప్పర్ మోషన్ ప్రతినిధులు : సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆ సంస్థ సీఈఓ ఆండ్రియాస్ హేగర్ సహా ఇతర ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ.4,640 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్ క్లస్టర్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు పెప్పర్ మోషన్ సంస్థ తెలిపింది.
-
చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ.4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటుచేయనున్న పెప్పర్ మోషన్. అతి త్వరలో భూమిపూజకు సిద్ధమవుతున్న కంపెనీ. 8,100 మంది ఇంజనీర్లు, టెక్నీషియన్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. https://t.co/FZsZ66cDUR
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ.4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటుచేయనున్న పెప్పర్ మోషన్. అతి త్వరలో భూమిపూజకు సిద్ధమవుతున్న కంపెనీ. 8,100 మంది ఇంజనీర్లు, టెక్నీషియన్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. https://t.co/FZsZ66cDUR
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 29, 2023చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ.4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్ ఏర్పాటుచేయనున్న పెప్పర్ మోషన్. అతి త్వరలో భూమిపూజకు సిద్ధమవుతున్న కంపెనీ. 8,100 మంది ఇంజనీర్లు, టెక్నీషియన్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. https://t.co/FZsZ66cDUR
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 29, 2023
Pepper Motion Representatives Met with Jagan : గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, విధానాలపై పెప్పర్ మోషన్ ప్రతినిధులతో సీఎం జగన్ చర్చించారు. ఏడాదికి 30,000 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు తయారీ సామర్ధ్యంతో యూనిట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు పెప్పర్ మోషన్స్ సంస్థ తెలియచేసింది. డీజిల్ బస్సులు, ట్రక్కులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రెట్రోఫిట్టింగ్ 20 గిగావాట్ సామర్ధ్యంతో బ్యాటరీల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు పెప్పర్ మోషన్స్ తెలియచేసింది.
పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: జగన్
Chief Minister Jagan Released Adudam Andhra Sports Tournament Mascot : ఆడుదాం ఆంధ్రా అధికారిక చిహ్నాన్ని ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. రాష్ట్ర జంతువు కృష్ణ జింకను ఆడుదాం ఆంధ్రా క్రీడలకు మస్కట్‌గా మార్చి చిహ్నాన్ని విడుదల చేశారు. ఎక్స్ ద్వారా ఆడుదాం ఆంధ్రా మస్కట్‌ను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే క్రీడా టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరుతారని ఆకాంక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
-
మన ఆడుదాం ఆంధ్రా అధికారిక చిహ్నం "కిట్టు"ని పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు ఈరోజే రిజిస్టర్ చేసుకోండి
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- సీఎం#AadudamAndhra pic.twitter.com/yxMgKnBnfX
">మన ఆడుదాం ఆంధ్రా అధికారిక చిహ్నం "కిట్టు"ని పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు ఈరోజే రిజిస్టర్ చేసుకోండి
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 29, 2023
- సీఎం#AadudamAndhra pic.twitter.com/yxMgKnBnfXమన ఆడుదాం ఆంధ్రా అధికారిక చిహ్నం "కిట్టు"ని పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు ఈరోజే రిజిస్టర్ చేసుకోండి
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 29, 2023
- సీఎం#AadudamAndhra pic.twitter.com/yxMgKnBnfX