ETV Bharat / state

'ఇస్కాన్' ఆధునిక వంటశాలను ప్రారంభించిన సీఎం జగన్ - 'ఇస్కాన్' ఆధునిక వంటశాలను ప్రారంభించిన సీఎం జగన్

గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలోని అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్మించి కేంద్రీకృత వంటశాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. "జగనన్న గోరుముద్ద" పథకానికి అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం అందజేస్తోంది. వంటశాలను ప్రారంభించిన అనంతరం.. విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనం వడ్డించారు.

'ఇస్కాన్' ఆధునిక వంటశాలను ప్రారంభించిన సీఎం జగన్

author img

By

Published : Feb 18, 2022, 10:19 PM IST

'ఇస్కాన్' ఆధునిక వంటశాలను ప్రారంభించిన సీఎం జగన్

జగనన్న గోరుముద్ద పథకానికి ఆహారం అందించేందుకు ఇస్కాన్ ఆక్షయ పాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక వంటశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో అత్యాధునిక వంటశాలను ఇస్కాన్ ఏర్పాటు చేసింది. కేవలం రెండు గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్ధం చేసేలా దీన్ని నిర్మించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ వంటశాలను ఇవాళ ప్రారంభించారు. విద్యార్ధులకు స్వయంగా భోజనం వడ్డించారు. తాను కూడా వంటకాలు రుచి చూశారు. కేంద్రీకృత వంటశాలను పరిశీలించి దాని ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేస్తున్న విధానాన్ని అక్షయ పాత్ర ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరం ముఖ్యమంత్రి అక్కడి నుంచి కొలనుకొండ వెళ్లారు. కొలనుకొండలో ఇస్కాన్ నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు. 70 కోట్ల రూపాయలతో ఏర్పాటయ్యే గోకుల క్షేత్రంలో రాధాకృష్ణులు, వేంకటేశ్వర ఆలయాలతోపాటు ధ్యాన కేంద్రాలు, యువతకు శిక్షణ కేంద్రాలు నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు సుచరిత, శ్రీరంగనాథరాజు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

ఆయనది హోల్​సేల్ దోపిడీ అయితే.. వారిది చిల్లర దోపిడీ: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.