Oxygen Plants In Guntur GGH: కరోనా థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో తలెత్తిన ఆక్సిజన్ కొరత మళ్లీ రాకుండా జీజీహెచ్ రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
ఒక్కొక్కటి 1000 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లను ముఖ్యమంత్రి జగన్ రేపు వర్చువల్గా ప్రారంభించనున్నారు. కరోనా మెుదటి వేవ్ సమయంలో ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. మళ్లీ అటువంటి పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి చెప్పారు.
ఇదీ చదవండి
CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్