ETV Bharat / state

'సీఎం జగన్ కుటుంబం ఆస్తులు ప్రకటించాలి'

పదేళ్లుగా స్వచ్ఛందంగా చంద్రబాబు కుటుంబం ఆస్తులు ప్రకటిస్తుంటే... దీనిపై వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ తన ఆస్తులను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

tdp leader pattabi
tdp leader pattabi
author img

By

Published : Feb 21, 2020, 7:27 PM IST

మీడియా సమావేశంలో పట్టాభి

చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులపై సాక్షి పత్రిక అసత్య కథనాలు రాస్తోందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి దుయ్యబట్టారు. పదేళ్లుగా స్పచ్ఛందంగా చంద్రబాబు కుటుంబం ఆస్తుల వివరాలను ప్రకటిస్తోందని అన్నారు. నారా దేవాన్ష్ ఆస్తులను తప్పపడుతున్న సాక్షి, ఆ చిన్నారికి తన తల్లిదండ్రులిరువురి వైపు నుంచి తాతయ్యలు ఉన్నారని తెలుసుకోవాలని హితవు పలికారు. నందమూరి బాలకృష్ణ తన పేరుతో ఉన్న 26,400 షేర్లను దేవాన్ష్​కు బహుమతిగా ఇచ్చారని తెలిపారు. నారా భువనేశ్వరి ఆస్తులు గతేడాది కంటే, ఈ ఏడాది 8కోట్ల 50 లక్షల వరకు పెరిగాయని పట్టాభి వివరించారు. దమ్ముంటే జగన్ కుటుంబం ఆస్తులను ప్రకటించాలని ప్రతిసారీ నారా లోకేశ్ సవాల్ విసురుతున్నా వైకాపా నుంచి ఒక్కరు కూడా స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. సవాల్​కు వైకాపా అధినేత జగన్ కట్టుబడి ఉంటే... తన ఆస్తుల వివరాలు వెల్లడించాలని పట్టాభి డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

అందుకే హడావుడిగా ఆస్తులు ప్రకటించారు: శ్రీకాంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.