వైకాపా ఏడాది పాలనలో ప్రజలకు జరిగిన మేలు కంటే రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కవని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. పరిపాలనలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని.... అప్రజాస్వామిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారని విమర్శించారు.
రాజధాని విషయంలో 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించారన్న ముప్పాళ్ల.... రాజకీయ కక్ష సాధింపు చర్యలను జగన్ ఇప్పటికైనా మానుకోవాలన్నారు. అసంబద్ధ ఇసుక విధానంతో ఎందరో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి 12 మాసాలైనా అతీగతి లేదని ఆరోపించారు. ఏడాది పాలనలో ఏమి సాధించారని సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు.
ఇదీ చదవండి