CM CONDOLENCE TO KAIKALA : నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కైకాల గొప్ప వ్యక్తిత్తం కలిగిన వ్యక్తని ఆయన కొనియాడారు. నటుడిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపు రాని పాత్రలతో ప్రజలను మెప్పించారన్నారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారన్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని అన్నారు. కైకాల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-
గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/eJdUwqnINz
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/eJdUwqnINz
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2022గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/eJdUwqnINz
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2022
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్‌రెడ్డి సంతాపాన్ని తెలిపారు. 750కి పైగా చిత్రాలలో నటించిన విలక్షణమైన నటుడిగా, నవరస నటనా సార్వభౌముడిగా పేరు ప్రఖ్యాతలు గడించిన కైకాల తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవ చేసారని ఆయన తెలిపారు. రఘుపతి వెంకయ్య అవార్డు, నందీ అవార్డులను గెలుచుకున్న కైకాల సత్యనారాయణ నాటక రంగం పునాదిగా నటనా జీవితాన్ని ప్రారంభించి అనేక విలక్షణ పాత్రల్లో అశేష ప్రేక్షకులను అలరించారని ఆయన కొనియాడారు. కైకాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: