ETV Bharat / state

అక్కాచెల్లెళ్లంటూనే నడిరోడ్డుపై నిలబెట్టారు - అంగన్వాడీల ఆవేదనపై నోరు మెదపని జగనన్న - అంగన్‌వాడీ వర్కర్ల తాజా నిరసన

CM Jagan Cheating Anganwadi Workers: అంగన్‌వాడీలు నా అక్కాచెల్లెళ్లంటూ ఆప్యాయంగా బుగ్గలు నిమిరారు. తలపై చేతులు పెట్టి మరీ ఆశీర్వదించారు. అధికారంలోకి రాగానే మీ స్థితి మార్చేస్తా, తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువే ఇస్తానంటూ ప్రగల్భాలు పలికారు. ముఖ్యమంత్రి పీఠంగా ఎక్కాక మాత్రం ఆ అక్కచెల్లెళ్లే శత్రువులయ్యారు. ఆశీర్వదించిన చేతులే ఇప్పుడు వారికి సంకెళ్లు వేయిస్తోంది. ఆడబిడ్డలని చూడకుండా అర్థరాత్రి అపరాత్రి పోలీస్‌ స్టేషన్లలో బంధించేలా చేస్తున్నారు. రెండేళ్ల నుంచి మొరపెట్టుకుంటున్నా కనీసం తమ మాటను సీఎం జగన్‌ ఆలకించడం లేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CM_Jagan_Cheating_Anganwadi_Workers
CM_Jagan_Cheating_Anganwadi_Workers
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 7:03 AM IST

Updated : Dec 15, 2023, 6:44 AM IST

అక్కాచెల్లెళ్లంటూనే అంగన్‌వాడీలను నడిరోడ్డుపై నిలబెట్టారు-అంగన్వాడీలు ఆవేదనపై నోరు మెదపని జగనన్నా

CM Jagan Cheating Anganwadi Workers : సీఎం జగన్‌ చేతిలో అంగన్‌వాడీలు దగాపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కి నిరసన తెలిపినా వారి గోడు ఆయన వినడం లేదు. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నామని మహిళలు ప్రకటించినా కనీసం వారిని పిలిచి మాట్లాడలేదు. అంగన్‌వాడీలు రెండేళ్లుగా శాంతియుత నిరసన తెలుపుతున్నారు. సమస్యల పరిష్కారించాలంటూ సీడీపీవో ప్రాజెక్టు కార్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. కానీ ఆందోళనలను పట్టించుకోకపోగా వారిపై పోలీసు అస్త్రాన్ని ప్రయోగించారు. ఉక్కుపాదంతో అంగన్వాడీలను అణచివేసేందుకు ప్రయత్నించారు. చివరికి విజయవాడ కేంద్రంగా ధర్నా చేసేందుకూ వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. కొన్నిచోట్ల మహిళలని అర్థరాత్రి పోలీసుస్టేషన్లలో ఉంచారు. ఒక స్టేషన్‌ నుంచి మరో స్టేషన్‌కు వాహనాల్లో తిప్పారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల ఆందోళన

Anganwadi Workers Problems in AP : గత ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ వరకు 4 వేల 200లు ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని భారీగా పెంచింది. రెండు విడతల్లో 6వేల 300 పెంచి 2018 జులై నాటికి 10 వేల 500 రూపాయలు చేసింది. దాదాపు 150 శాతం వేతనాన్ని పెంచింది. అప్పట్లో గౌరవవేతనం 10 వేలకు మించితే సంక్షేమ పథకాలు కోత వేసే అవకాశమున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అలా చేయలేదు. చిరుద్యోగులైన అంగన్‌వాడీ కార్యకర్తల పట్ల కనికరం చూపి ఆదాయ పరిమితి నిబంధన నుంచి మినహాయింపునిచ్చి సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేసింది. వైకాపా అధికారం చేపట్టగానే 2019 జూన్‌లో అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాన్ని 1000 చొప్పున పెంచింది. వారి వేతనం 11 వేల 500కు చేరింది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడంలో ఆరితేరిన జగన్‌..అంగన్‌వాడీలకు 1000 పెంచి, వారికిచ్చే సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టారు.

Anganwadies Agitation : 2021 జులైలో తెలంగాణ ప్రభుత్వం అక్కడి అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవవేతనాన్ని 10 వేల 500 నుంచి 13 వేల 650కి, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకిచ్చే వేతనాన్ని 6వేల నుంచి 7వేల 800కు పెంచింది. కానీ రాష్ట్రంలో పెంపు ఊసే లేదు. కనీసం వారి గోడు పట్టించుకున్న పాపాన పోలేదు.

నాలుగేళ్లయినా తీరని అంగన్వాడీల సమస్యలు - నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె

Anganwadi Staff Protest For To Resolve Issues : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని పెట్టాలని ఆదేశించే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెనూ ఛార్జీలను మాత్రం పెంచలేదని అంగన్‌వాడీలు గగ్గోలు పెడుతున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఏటికేడు రెట్టింపు అవుతున్నాయని వాపోతున్నా వారి మొర ఆలకించ లేదు. లబ్ధిదారుల సంఖ్యను బట్టి సరాసరి ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి 1500 నుంచి 2000 వరకు వంట ఖర్చు వస్తోందని వారు చెబుతున్నా సర్కారు పెడచెవిన పెడుతోంది. గ్యాస్‌ బండ భారమూ అంగన్‌వాడీ కార్యకర్తలపైనే వేస్తోంది. రోజుకు గర్భిణులు, బాలింతలకు ఒక్కొక్కరికీ రూపాయి 75 పైసలు, 3నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు 50 పైసల చొప్పున ప్రభుత్వం గ్యాస్‌ వినియోగానికి చెల్లిస్తోంది. కొన్ని కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలపై నెలకు 500 నుంచి 800 వరకు భారం అంగన్వాడీల చేతి నుంచి పడుతోంది. ఆపైకం సైతం ప్రభుత్వం చెల్లించడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Anganwadi Workers Problems Increase in YSRCP Government : అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీని వర్తింపజేయాలని సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇచ్చింది. దాని అమలుకు చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీలు విన్నవిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పదవీ విరమణ చేసిన కార్యకర్తలకు గత ప్రభుత్వంలో 50 వేలు ఇచ్చారు. దాన్ని 5 లక్షలకు పెంచాలని కోరినా పట్టించుకోలేదు సరికదా ఇప్పటికే పదవీవిరమణ చేసిన వారికి గతంలో ఇచ్చిన 50 వేలూ ఇవ్వలేదు. ఇంత దగా సర్కారును ఎక్కడా చూడలేదని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరు ఆగదని హెచ్చరిస్తున్నారు.

Anganwadis Chalo Vijayawada: అంగన్​వాడీల ఛలో విజయవాడపై.. పోలీసుల ఉక్కుపాదం..!

Last Updated : Dec 15, 2023, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.