ETV Bharat / state

వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై జగన్​ కసరత్తు - నేతలలో ఉత్కంఠ - వైసీపీనేతలతో సీఎం భేటీ

CM Jagan BIG SHOCK TO Ministers and MLAs: పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్​ భేటీ అయ్యారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరామ్‌, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తదితరులు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో వారి వారి సీట్ల మార్పు, సీట్ల కేటాయింపుపై వారితో జగన్ చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 5:19 PM IST

Updated : Dec 19, 2023, 7:26 PM IST

మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ

CM Jagan BIG SHOCK TO Ministers and MLAs: రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం వైసీపీ సిద్దమవుతుంది. అందుకోసం ప్రభుత్వంపై వ్యతిరేకత, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర నేతల మార్పుపై వైసీపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దల నుంచి ఫోన్ వచ్చిందంటే మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తమకు స్థానచలనం ఉంటుందో ? లేక స్థానమే లేకుండా పోతుందో ? అన్న అంశంపై, సీఎం జగన్ ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం జగన్ నుంచి పిలుపు రావడం, వారితో సీఎం జగన్ చర్చలు జరపడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

అంతన్నాడు, ఇంతన్నాడు - తీరా చూస్తే నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచుతున్నాడు

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేఫథ్యంలో ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్​చార్జీలను మార్చారు. వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తున్నట్లు అభ్యర్థులకు స్పష్టం చేశారు. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ చార్జీల మార్పుపై చర్చలు జరుపుతున్నారు. ఇవాళ మరికొందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం సీఎంను కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై వీరితో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్​చార్జీలను ఖరారు చేస్తున్నారు. పోటీ చేసే స్థానాల విషయమై స్పష్టత ఇస్తున్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి వచ్చి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తమ సీటు విషయమై చర్చించారు.

వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలకు మరోషాక్ ఇవ్వనున్న జగన్ - త్వరలోనే మరో లిస్ట్ విడుదల!

ఇక గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మేల్యే, విప్ ప్రసాదరాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్, కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాష, మంత్రి శంకరనారాయణ సీఎంవోకు వచ్చి పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. కొంతమందికి సీటు ఇవ్వడం కుదరదని, అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పినట్లు తెలిసింది.

నిన్న ఉభయగోదావరి జిల్లాల నేతలతో చర్చించిన సీఎం ఇవాళ మరి కొంత మంది నేతలు, ఆశావహులతోనూ చర్చించారు. రెండు రోజుల్లో పలు నియోజకవర్గాల్లో ఇన్​చార్జీలను ఖరారు చేసి ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Last Updated : Dec 19, 2023, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.