నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు రూ. 1228 కోట్లు సీఎం జగన్ ప్రకటించారని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి, మిర్చి పొలాలను ప్రభుత్వ వ్యవసాయ ప్రధాన సలహాదారు కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ శివరామకృష్ణలతో కలసి పరిశీలించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేసేందుకు నాణ్యత విషయంలో సడలింపు కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. అక్టోబర్ వరకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించినట్లు తెలిపారు. రైతులకు నష్ట పరిహారం చెల్లింపు విషయంపై సీఎం జగన్ రోజూ చర్చిస్తున్నారన్నారు. 70 శాతం కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని.. భూ యజమానులు కౌలు రైతులకు సహకరించాలని కోరారు.
రైతులను ప్రభుత్వం అన్ని విధాలా అదుకుంటుందని వ్యవసాయ ప్రభుత్వ ప్రధాన సలహాదారు కృష్ణారెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా పంట నష్టం జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి.. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి...