ఆంధ్రులతో పెట్టుకున్న వాళ్లెవరూ బాగుపడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హోదా కావాలని అడిగినందుకే రాష్ట్రంపై మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి దేశాన్ని మోదీ, అమిత్‌షా ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు. మోదీని ఓడించకుంటే భవిష్యత్తులో ఎన్నికలనేవి ఉండవని అభిప్రాయపడ్డారు. రోజంతా ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించే జగన్.. సాయంత్రమైతే కేసీఆర్ దగ్గరకి వెళ్లి నివేదిక ఇస్తారని విమర్శించారు. జగన్ విడుదల చేసిన వైకాపా ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)లో అమరావతి ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. రాజధానిని మార్చేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్‌కి ఓటేస్తే గుంటూరు జిల్లా ఎడారిగి మారిపోతుందన్న సీఎం... మోదీపై పోరాడే సత్తా తనకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
వైకాపా మేనిఫెస్టోలో... అమరావతి ఎక్కడ?: చంద్రబాబు
జగన్ విడుదల చేసిన వైకాపా ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)లో అమరావతి ప్రస్తావన ఎందుకు లేదని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధానిని మార్చేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రులతో పెట్టుకున్న వాళ్లెవరూ బాగుపడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హోదా కావాలని అడిగినందుకే రాష్ట్రంపై మోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి దేశాన్ని మోదీ, అమిత్‌షా ఏం చేయబోతున్నారని ప్రశ్నించారు. మోదీని ఓడించకుంటే భవిష్యత్తులో ఎన్నికలనేవి ఉండవని అభిప్రాయపడ్డారు. రోజంతా ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించే జగన్.. సాయంత్రమైతే కేసీఆర్ దగ్గరకి వెళ్లి నివేదిక ఇస్తారని విమర్శించారు. జగన్ విడుదల చేసిన వైకాపా ఎన్నికల ప్రణాళిక(మేనిఫెస్టో)లో అమరావతి ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. రాజధానిని మార్చేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్‌కి ఓటేస్తే గుంటూరు జిల్లా ఎడారిగి మారిపోతుందన్న సీఎం... మోదీపై పోరాడే సత్తా తనకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
Body: ఈటీవీ
Conclusion:ఈటీవీ
TAGGED:
వైకాపా ప్రచారం