గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటలో.. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఘర్షణకు దిగారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన మల్లి, నాగూర్ వలి, నయీమ్ మద్యం సేవించేందుకు నులకపేటకు చేరుకున్నారు. మద్యం కొనుగోలు, నగదు వ్యవహారంలో.. ముగ్గురి మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో నయీమ్.. మల్లిపై మద్యం(బీరు) సీసాతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వీరిద్దరి మధ్య ఘర్షణ రేగడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడకు చేరుకుని.. ఘటనలో గాయపడిన మల్లిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు యువకులను విచారణ నిమిత్తం తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి:
Nara Lokesh: పరిహారం ఇవ్వకుండా భూమి లాక్కోవడమేంటి..?: నారా లోకేశ్