CID officers searched former minister Narayana residences: అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో ఆంధప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుమార్తె నివాసాల్లో సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలోని నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. గతంలో మాదాపూర్ నారాయణ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరిగాయి. తాజాగా కొండాపూర్‌లోని కోలా లగ్జరియా, గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబూస్, కూకట్‌పల్లిలోని లోధా టవర్స్‌లోని నారాయణ కుమార్తెల నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు. ఆయా ప్రాంతాలకు వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు నివాసాల్లో ఈ ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. అమరావతి భూముల కొనుగోళ్ల అంశంపై వివరాలు సేకరిస్తున్నారు.
అసలేం జరిగిందంటే...: గత ప్రభుత్వంలోని కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు తమను మోసగించారంటూ రాజధానికి చెందిన కొంతమంది రైతులు ఆరోపించారని. తమ భూముల్ని అక్రమంగా, మోసపూరితంగా తీసుకున్నారని వారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే భూ సమీకరణ కింద వాటిని ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొంటూ.. కొంతమంది మధ్యవర్తులు అమాయక రైతుల్లో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. భూములు పోతాయనే అభద్రతను, భయాన్ని కల్పించారని... పెద్ద కుట్రలో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్నిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. అందులో అనేక అవకతవకలు ఉన్నాయని. వాటి వల్ల ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు తీవ్రనష్టం వాటిల్లిందంటూ. ఈ జీవోల ద్వారా గత ప్రభుత్వ హయాంలోని వ్యక్తులు అనుచిత లబ్ధి పొందారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా మర్నాడే సీఐడీ అధికారులు విచారణకు ఆదేశించారు. అప్పటి డీఎస్పీ ఎస్.సూర్యభాస్కరరావును విచారణాధికారిగా నియమించారు.
ఇవీ చదంవడి: