Baptism Ghat Construction Controversy: మంగళగిరి పెదవడ్లపూడి మార్గంలో నిర్మిస్తున్న బాప్టిజం ఘాట్ ఇది. మరో మతంలోకి మారేందుకు ఉద్దేశిస్తూ ఓ ప్రాంతాన్ని ఖరారు చేయడం, దానికి నగరపాలక సంస్థ స్థలం కేటాయించడం వివాదానికి దారితీసింది. పాస్టర్ల విజ్ఞప్తి మేరకు స్థలం కేటాయించాలని అధికారుల్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. వెంటనే నగరపాలక సంస్థ అధికారులు తీర్మానం చేసి స్థలం కేటాయించారు. జూన్ 2న ఎమ్మెల్యే స్వయంగా బాప్టిజం ఘాట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఒక నెల వేతనం లక్షా 80వేల రూపాయలను విరాళంగా ప్రకటించారు.
Somu Veerraju Interview: 'అవధూత భూములు లీజుకిస్తే ఊరుకోం.. అన్యాక్రాంతం చేస్తే సహించం'
అప్పట్లోనే బీజేపీ నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కొన్ని రోజులుగా పనులు జరుగుతుండటంతో బీజేపీ, వీహెచ్‌పీ నేతలు ఆందోళనకు దిగారు. పనుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిరసనకు రాకుండా మరికొందరు నేతలను ఇళ్ల వద్దే నిర్బంధించారు. ఈ ఘాట్ నిర్మాణంతో మత మార్పిడులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని.. బీజేపీ, వీహెచ్‌పీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Amaravati R5 Zone: ఆర్ 5 జోన్‌పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కేంద్ర మంత్రికి లేఖ
"ఎక్కడైనా ఒక సమస్య వచ్చినప్పుడు.. పోలీసు అధికారులు వెళ్లి దాన్ని ఆపాలని చూస్తారు.. ఏదో ఒకటి తేలేంతవరుకు ఆ పని చెయ్యొద్దని చెప్తారు. కానీ పోలీసులు అలా చేయకుండా ఒక వర్గం వారిని తోసేస్తూ.. మరో వర్గం వారికి మద్దతుగా నిలుస్తూ.. కాపలాగా ఉండి.. ఘాట్ నిర్మాణానికి సహకారం అందిస్తున్నారు. సీఆర్డీఏ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, ఆర్ఎన్డీ, రెవెన్యూ అధికారులకు కనిపించటంలేదా..?ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆ బాప్టిజం ఘాట్ నిర్మాణాన్ని.. మేము పగులగొట్టేలోపే ఆపితే బాగుంటుంది." - పాటిబండ్ల రామకృష్ణ, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు
స్థానికుల్లోనూ కొందరు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. హిందువులు అధికంగా ఉన్న చోట ఏవిధంగా క్రైస్తవులకు స్థలం ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. హిందూ దేవాలయాలకు చెందిన భూములను వేలం వేస్తూ.. ప్రభుత్వ భూములను బాప్టిజం ఘాట్‌కు ఇవ్వడం ఏంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నిస్తున్నారు. క్రైస్తవంపై నమ్మకం ఉన్నవారు మతంలోకి వచ్చేటప్పుడు పవిత్ర స్నానం చేయిస్తామని.. అందుకోసం స్థలం అడిగితే కార్పొరేషన్ అధికారులు కేటాయించారని పాస్టర్లు చెబుతున్నారు.
అధికారికంగా స్థలం కేటాయించిన తర్వాతే నిర్మాణం ప్రారంభించామని అంటున్నారు. మత మార్పిడిని రాజ్యాంగం అనుమతిస్తోందని.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఘాట్‌కు స్థలం కేటాయించామని చెబుతున్నారు. భారతదేశం లౌకిక దేశమన్న ఆయన.. అలా కాదని చెప్పాలనుకుంటే హిందూ దేశంగా ప్రకటించాలని బీజేపీ నేతలకు సూచించారు. నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నవారు నిబంధనల ప్రకారం అధికారులను కలిసి విజ్ఞప్తి చేయాలని.. అలా కాకుండా ఘాట్‌ను అడ్డుకుంటామంటే ఊరుకునేది లేమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.