నాబార్డు చైర్మన్గా గుంటూరు జిల్లాకు చెందిన చింతాల గోవిందరాజులు బాధ్యతలు స్వీకరించారు. లాక్డౌన్ కారణంగా బెంగళూరులోని నాబార్డు ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గోవిందరాజులు స్వగ్రామం గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు. గతంలో నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మేనేజింగ్ డైరెెక్టర్గా సేవలు అందించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో 'మిడతల దండు'యాత్ర!