ETV Bharat / state

16న సీఎస్ అధ్యక్షతన.. వివిధ శాఖల కార్యదర్శుల స్థాయి సమావేశం

author img

By

Published : Feb 13, 2023, 4:53 PM IST

CS JAWAHAR MEETING WITH SECRETARIATS: వివిధ శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డి స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు మరిన్ని అధికారాల బదలాయింపు, సామర్థ్యం పెంపు తదితర అంశాలపై సచివాలయంలో ఈ నెల 16 తేదీన సమావేశం చేపట్టనున్నారు.

CS JAWAHAR MEETING WITH SECRETARIATS
CS JAWAHAR MEETING WITH SECRETARIATS

CS JAWAHAR MEETING WITH SECRETARIES: సచివాలయంలో ఈ నెల 16 తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్​ జవహర్ రెడ్డి అధ్యక్షతన వివిధ శాఖల కార్యదర్శుల స్థాయి సమావేశం జరగనుంది. గ్రామ, వార్డు సచివాలయాలకు మరిన్ని అధికారాల బదలాయింపు, సామర్థ్యం పెంపు తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు సహా గ్రామ, వార్డు సచివాలయ ఖాళీల భర్తీపైనా కార్యదర్శుల సమావేశంలో చర్చించనున్నారు.

సచివాలయంలో విధుల పునఃవ్యవస్థీకరణ అనంతరం దస్త్రాల నిర్వహణ, పని భారం తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన శాఖ నిర్దేశించిన విధానంలో ఈ-ఆఫీస్ దస్త్రాల నిర్వహణ, వివిధ ప్రభుత్వ శాఖల వారీగా ఏసీబీ కేసులు, విజిలెన్స్ కేసులపై సమీక్ష చేయాలని నిర్ణయించారు. వివిధ శాఖల వారీగా ప్రభుత్వంపై నమోదైన కోర్టు కేసులు, విచారణ పెండింగ్ అంశాలపై కార్యదర్శుల సమావేశం సమీక్ష చేయనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన కసరత్తు పైనా కార్యదర్శులు చర్చించనున్నారు.

JAWAHAR REDDY AS NEW CS TO AP : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌ రెడ్డి నియమితులయ్యారు. సమీర్‌ శర్మ పదవీ విరమణ తర్వాత.. 1990 బ్యాచ్‌ ఐఏఎస్​ అధికారి కేఎస్​ జవహర్‌రెడ్డిని నూతన సీఎస్‌గా ప్రభుత్వం నియమించింది. గత ఏడాది నవంబర్​ 30వ తేదీతో సమీర్ శర్మ పదవీకాలం పూర్తి కాగా.. గత డిసెంబరు 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2024 జూన్‌ వరకు.. అంటే మరో ఏడాదిన్నరపాటు జవహర్‌ రెడ్డి సీఎస్‌ పోస్టులో కొనసాగనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.