ETV Bharat / state

కేంద్రం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం.. డిసెంబర్​ 5న దిల్లీకి పయనం - babu delhi tour

CBN DELHI TOUR : టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి.. ఆయన హాజరుకానున్నారు. ఈమేరకు సమావేశానికి రావాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి.. చంద్రబాబుకు ఫోన్‌ చేసి ఆహ్వానించారు.

CBN DELHI TOUR
CBN DELHI TOUR
author img

By

Published : Nov 23, 2022, 12:42 PM IST

Updated : Nov 23, 2022, 1:20 PM IST

CHANDRABABU WILL GO TO DELHI ON 5TH DECEMBER : తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిసెంబర్ 5న దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి.. చంద్రబాబు హాజరుకానున్నారు. 2022 డిసెంబర్‌ 1 నుంచి 2023 నవంబర్‌ 30 వరకు జరగనున్న జీ 20 దేశాల కూటమి సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహించనుంది. రాజకీయ పార్టీల అధ్యక్షులతో.. జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశంలో ప్రధాని మోదీ చర్చించనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్‌ 5న సాయంత్రం 5 గంటలకు ఈ సదస్సు జరగనుంది. సదస్సుకు రావాలని చంద్రబాబుకు.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నుంచి ఆహ్వానం అందింది. చంద్రబాబుకు ఫోన్‌ చేసిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి.. సమావేశానికి రావాలని ఆహ్వానించడంతో పాటు సమావేశ ప్రాధాన్యతను చంద్రబాబుకు వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 23, 2022, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.