ETV Bharat / state

మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు రెండు రోజుల పర్యటన వివరాలు ఇవే! - మిచాంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు

Chandrababu Visit Michaung Cyclone Affected Areas: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి తిరిగి ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9 వ తేదీన అరెస్ట్ అయిన తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న చంద్రబాబు, దాదాపు మూడు నెలల విరామం తర్వాత తిరిగి ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధమైయ్యారు. మిగ్‌జాం తుఫాను వల్ల పంట నష్ట పోయిన రైతులను పరామర్శించి వారికీ దైర్యం చెప్పేందుకు చంద్రబాబు పర్యటనలకు బయలుదేరుతున్నారు.

Chandrababu_Visit_Michaung_Cyclone_Affected_Areas

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 9:05 AM IST

Chandrababu Visit Michaung Cyclone Affected Areas : మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాలైన గుంటూరు, బాపట్ల జిల్లాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు నేడు తెనాలి, వేమూరు, బాపట్ల నియోజక వర్గాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిసీలించి రైతులకు ధైర్యం చెబుతారు. తెనాలిలోని నందివెలుగు నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు పర్యటన అక్కడి నుంచి అమృతలూరు, నగరం, కర్లపాలెం మండలాల్లో సాగనుంది. రాత్రి బాపట్లలోనే చంద్రబాబు బస చేస్తారు. అనంతరం శనివారం పర్చూరు , పత్తిపాడు నియోజకవర్గాల్లోని తుఫాను ప్రభావిత పంటలను చంద్రబాబు పరిశీలిస్తారు.

Chandrababu Naidu Tour in Guntur District : తుపాను బాధిత ప్రజలకు తక్షణ అవసరాలైన ఆహారం, నీళ్లు, పునరావాసం కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. టీడీపీ హయాంలో ప్రత్యేక జీవోల ద్వారా పరిహారం పెంచి సాయం చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు సంభవించిన తుపాన్ల సమయంలో అరకొరగానే సాయం చేసిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయి విపత్తు అని ముందే తెలిసినా ప్రజలను సన్నద్ధం చేయటంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని, వ్యవస్థల నిర్వీర్యం వల్లే నేడు ఈ దుస్థితి ఎదురైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంట చేతికందే సమయంలో తుపాను - అన్నదాతల్లో కలవరం

Today CBN Schedule : విపత్తుల సమయంలో రైతులను ఆదుకోడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి సాయం అందించామని టీడీపీ నేతులు గుర్తు చేస్తున్నారు. హుద్‌ హుద్‌ సమయంలో జీవో9, తిత్లీ తుపాను సమయంలో జీవో14 ద్వారా నష్ట పరిహారం పెంచి రైతులకు అండగా నిలబడ్డామన్న నేతలు, టీడీపీ హయాంలో ఇచ్చింది, వైసీపీ ప్రభుత్వం ఇటీవల కొన్ని తుపాన్ల సమయంలో కోతలు పెట్టిందని ఆక్షేపిస్తున్నారు. నాటితో పోల్చుకుంటే నేడు పెరిగిన సాగు ఖర్చులు, ఇతర భారాలను దృష్టిలో పెట్టుకుని పరిహారం మరింత పెంచి ఇవ్వాలని డిమాండును చంద్రాబాబు ప్రభుత్వం ముందు ఉంచనున్నారని టీడీపీ నేతలు తెలిపారు.

నిండా ముంచిన మిగ్‌జాం తుపాను - ఆందోళనలో రైతులు

చంద్రబాబు డిమాండ్స్ : ప్రధానం గా వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.30,000 చొప్పున, ఆక్వా రైతులకు రూ.50,000, అరటికి రూ.40,000, చెరకురూ.30,000, పత్తి, వేరుశనగ కు రూ.25,000, జొన్న, మొక్కజొన్న, అపరాలు, పొద్దుతిరుగుడుకు రూ.15,000, జీడి పంటకు 50,000 వేల చొప్పున పరిహారం ఇవ్వాలనే డిమాండ్​ను చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచుతున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

రైతన్న ఇంట కన్నీరును మిగిల్చిన తుపాను - లక్షలాది ఎకరాలు వర్షార్పణం

మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు రెండు రోజుల పర్యటన- ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచనున్న బాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.