ETV Bharat / state

'స్థానిక సమరంలో సత్తాచాటి చంద్రబాబుకు కానుక ఇవ్వాలి'

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి అధినేత చంద్రబాబుకు కానుక ఇవ్వాలని తెదేపా కార్యకర్తలకు లోకేశ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో పార్టీ కార్యకర్తలతో సమావేశానికి హాజరయ్యారు.

స్థానిక సమరంలో సత్తాచాటి చంద్రబాబుకు కానుక ఇవ్వాలి

author img

By

Published : Feb 18, 2020, 12:52 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అన్ని స్థానాల్లో గెలిచే విధంగా కార్యకర్తలు కృషిచేసి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 23 స్థానాల్లో గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంగా ఉన్నట్లు తమ సర్వేలో వెల్లడైందన్నారు. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.

సంస్థాగతంగా బలంగా ఉండేందుకు గ్రామ, వార్డు, మండల కమిటీలు కలిసి పనిచేయాలన్నారు. ఇసుక, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. 62రోజులుగా అమరావతిలో ఆందోళనలు జరుగుతున్నా... సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

'నాడు- నేడు'కు నేడే సీఎం జగన్ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.