ETV Bharat / state

Chandrababu on UCC: యూసీసీ అంశంలో ముస్లింలకు టీడీపీ అండ.. స్పష్టం చేసిన చంద్రబాబు - uniform civil code issue

Chandrababu on UCC: యూసీసీ(UCC) విషయంలో ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్​ భవన్​లో ముస్లిం మతపెద్దలు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు, టీడీపీలోని ముస్లిం నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

Chandrababu on UCC
Chandrababu on UCC
author img

By

Published : Jul 20, 2023, 12:23 PM IST

Chandrababu on UCC: యూసీసీ(యూనిఫామ్​ సివిల్​ కోడ్​) విషయంలో ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీల మనోభావాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎప్పుడూ పనిచేయదని, వారి మతవిశ్వాసాల్ని గౌరవిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యూసీసీ) బిల్లుపై ముస్లింల నుంచి వచ్చిన సూచనలపై అధ్యయనం చేసి.. వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ముస్లిం మతపెద్దలు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు, టీడీపీలోని ముస్లిం నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. యూసీసీపై తమ అభ్యంతరాలు, అభిప్రాయాలు, నష్టాల్ని వారు చంద్రబాబుకు వివరించారు. యూసీసీ వల్ల కేవలం ముస్లింలకే నష్టం జరుగుతుందనే వాదన తప్పని, మతస్వేచ్ఛను కాలరాసే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని వారు కోరారు. ఈ క్రమంలో ముస్లిం మైనార్టీల అభిప్రాయాలను టీడీపీ గౌరవిస్తుందని, ఈ బిల్లు విషయంలో వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పుడూ లౌకికపార్టీగా టీడీపీ మత సామరస్యాన్ని కాపాడటం కోసం చేసిన కృషిని సమాజం చూసిందని వారికి వివరించారు. మహిళలకు ఆస్తిలో భాగం ఇవ్వాలని ఖురాన్‌లో అప్పట్లోనే పొందుపరిచారన్న చంద్రబాబు.. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తూ చట్టం చేశామని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించిన ఘనత టీడీపీదే అని.. నేడు హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం.. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలే అని స్పష్టం చేశారు.

గతంలో ముస్లిం సోదరులు హజ్‌యాత్రకు వెళ్లాలంటే ముంబయి వెళ్లాల్సి వచ్చేదన్న చంద్రబాబు.. హైదరాబాద్‌లో హజ్‌హౌస్‌ నిర్మించి వారి ప్రయాణకష్టాలు తొలగించామని గుర్తు చేశారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో సమస్య వస్తే తెలుగుదేశం ముందుందని వెల్లడించారు. ఇమామ్‌లు, మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చామన్నారు. అబ్దుల్‌కలాంను రాష్ట్రపతిగా ప్రతిపాదించామని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల మనోభావాల్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నామన్న చంద్రబాబు.. వారి సంక్షేమం కోసం దుఖాన్‌-మకాన్, రంజాన్‌ తోఫా, విదేశీవిద్య తదితర పథకాల్ని ప్రవేశపెట్టామని వివరించారు. ముస్లింల కోసం ప్రత్యేకంగా వైద్య, ఇంజనీరింగ్‌ కాలేజీలు తెచ్చామని... వక్ఫ్‌ ఆస్తులు రక్షించామని పేర్కొన్నారు.

కాగా, రాష్ట్రంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు కలచివేస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో ప్రభుత్వ వేధింపులతో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను ఆయన ప్రస్తావించారు. ఏ మతాన్నై గౌరవించాలి కానీ ద్వేషించకూడదని పిలుపునిచ్చారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం ముస్లిం మత పెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారు.

పలు నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష: రాజానగరం తెలుగుదేశం అభ్యర్ధిని కమిటీ వేసి త్వరలోనే ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఎర్రగొండపాలెం, రాజానగరం, కర్నూలు నియోజకవర్గాలపై సమీక్ష కొనసాగించారు. రాజానగరం సమీక్షలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, స్థానిక నేతలు హాజరై తమ అభిప్రాయాలు చెప్పారు. నాయకత్వాన్ని త్వరగా తేల్చాలని నేతలు అధినేతను కోరారు. త్వరలోనే ఇందుకనుగుణంగా కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు వారికి తెలిపారు.

ఎర్రగొండపాలెంలో విభేదాలు మాని అందరిని కలుపుకుపోవాలని ఇంచార్జ్‌ ఎరిక్షన్ బాబుకు సూచించారు. ఈ సారి ఖచ్చితంగా తెలుగుదేశం ఎర్రగొండపాలెంలో గెలిచి తీరాలన్న చంద్రబాబు.. ప్రతి ఒక్కరూ ఎరిక్షన్ బాబు నాయకత్వానికి సహాకరించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కర్నూలు నియోజకవర్గంలో మరింత మెరుగ్గా పనిచేసుకోవాలని ఇంచార్జ్‌ టీజీ భరత్​కు చంద్రబాబు సూచించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా అన్ని కులాలను కలుపుకోవాలని దిశానిర్దేశం చేశారు. కర్నూలు నియోజకవర్గం సమీక్షలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఆలపాటి రాజా, స్థానిక నేతలు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.