ETV Bharat / state

" ఖబడ్దార్..! జాగ్రత్తగా ఉండండి.. వడ్డీతో సహా అప్పజెప్తాం" - ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి వడ్డీతో సహా అప్పజెప్తాం

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

" ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి వడ్డీతో సహా అప్పజెప్తాం"
author img

By

Published : Sep 4, 2019, 3:50 PM IST

" ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి వడ్డీతో సహా అప్పజెప్తాం"
గడిచిన వంద రోజుల పాలనలోనే ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపించిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో విమర్శించారు. పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెడితే ఎందుకు మూసివేసారనీ ప్రశ్నించారు. తప్పుడు విధానాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్​ రాజశేఖర్​రెడ్డి అనుమతులిచ్చారనీ, ఆ అనుమతులను తెదేపా ప్రభుత్వ హయాంలో రద్దు చేశామని గుర్తు చేశారు. తెదేపా కార్యాకర్తలు వైకాపా వేధింపులకు లొంగరనీ, మరింత ఉద్యమిస్తారని బాబు వ్యాఖ్యానించారు. తెదేపా వారిని వేధిస్తే వడ్డీతో సహా అనుభవిస్తారని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమనీ, నకిలీ వారు మాత్రమే పార్టీ మారుతారనీ ఆయన అన్నారు. రోజురోజుకీ తెదేపాకు ప్రజల్లో ఆదరణ పెరగటం వలనే కార్యాకర్తలపై తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టిస్తే ఒక్క వైకాపా నాయకుడైనా ఉండేవారా అంటూ ప్రశ్నించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా మెుదలుపెట్టిన అమరావతి నిర్మాణం ఆపేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి : దమ్ముంటే నాపై దాడి చేయండి: చంద్రబాబు

Intro:AP-RJY-61-04-NAGALA-DUKHANAM-CHORY-AV-AP100×2

Body:AP-RJY-61-04-NAGALA-DUKHANAM-CHORY-AV-AP100×2

Conclusion:AP-RJY-61-04-NAGALA-DUKHANAM-CHORY-AV-AP100×2
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.